కల్యాణ్‌రామ్ స్పీడుమీదున్నాడు. మొన్నే పటాస్ని మొదలెట్టాడు. ఈలోగా మరో సినిమాసెట్స్పైకి వెళ్లింది. అదే…షేర్. కల్యాణ్‌రామ్‌తో కత్తి తీసిన మల్లికార్జున్ ఈ చిత్రానికి దర్శకుడు. కొమర వెంకటేష్ నిర్మాత. ఈ చిత్రం ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి కల్యాణ్‌రామ్ క్లాప్ కొట్టారు. కథానాయికని ఇంకా ఎంపిక చేయాల్సివుంది. ”కల్యాణ్ క్యారెక్టరైజేషన్ ఈ చిత్రానికి హైలెట్. స్ర్కిప్ట్ పకడ్బందీగా రాసుకొన్నా. యాక్షన్ ఎంటర్టైనర్గా మలుస్తున్నాం. కథానాయిక ఎవరనేది త్వరలో ప్రకటిస్తామ” అని దర్శకుడు చెబుతున్నాడు. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నాడు.