Site icon TeluguMirchi.com

తప్పు చేశాను…కానీ సిగ్గు పడను

Kajal-Agarwalనటిగా ఎదిగే క్రమంలో కొన్ని తప్పులు చేశా… అంటోంది కాజల్. ఆమె తాజాగా నటించిన నాయక్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలకు సిద్దమైంది. ఈ సంధర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ …. తాను కెమెరా ముందుకు రాకమునుపు నటన పెద్ద విషయం కాదని , డైలాగులు అప్పజెప్పేస్తే ఓ పనైపోతుందని భావించేదాన్ని. కాని, ఆ తరువాత అనుభవపూర్వకంగా నటన అంటే ఏమిటో… పాత్రలో ఎలా ఒదిగిపోవాలో తెలుసుకున్నాననిచెప్పింది. కెరియర్ తొలినాళ్లలో తాను నటించిన తీరు చూసుకుంటే ఇప్పుడు తనకి నవ్వు వస్తుందనీ, అయినా నేర్చుకునే క్రమంలో ఇలాంటివి సహజమేననుకుని సర్దుకుపోతానని తెలిపింది. చిన్నప్పటి ఫోటోలు ఇప్పుడు చూసుకుంటే ఎలా అనిపిస్తుందో … తొలినాళ్ళలో తన నటన చూసుకున్నా తనకి అలాంటి అనుభూతే కలుగుతుందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక కాజల్ చిత్రాల విషయానికి వస్తే… నాయక్, బాద్షా చిత్రాలు విడుదలకు సిద్దంగా వుండగా హిందీ లో ‘ఎ వెన్స్‌డే’ ఫేం దర్శకుడు నీరజ్‌ ‘స్పెషల్‌ ఛబ్బిస్‌’ పేరిట రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version