స్టార్ ఇమేజ్ దక్కించుకొన్న కథానాయికల్లో కాజల్ పేరు కూడా చెప్పుకోవాలి. బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడా విజయాలు అందుకొంది. ఇక ముందు కూడా పక్కా ప్రణాళికతో సినిమాలు ఎంచుకోవాలని కాజల్ భావిస్తోంది. ఆమె మాట్లాడుతూ.. చేతికి అందిన సినిమాలు చేసుకొంటూ ఇమేజ్ పాడుచేసుకోను. నచ్చిన సినిమాలే చేస్తా.. అంటోంది. అంతేకాదు. రీమేక్ సినిమాల్లో నటించడానికి ఒప్పుకోదట. ఆల్రెడీ ఒకరు చేసిన సినిమాని మరోసారి ఎందుకు చేస్తా? దాని వల్ల ఉపయోగం ఏముంది? అని తెలివిగా సమాధానం చెబుతోంది.