పెళ్లి చేసుకుంటానన్న అభిమానికి షాకిచ్చిన కాజల్‌

అందాలముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లపైనా అయినా కూడా ఈ అమ్మడు చేతినిండా ప్రాజెక్ట్‌లతో చాలా బిజీగా ఉంది. ఒకానొక సమయంలో ఇక కాజల్‌ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఈ అమ్మడు పలు సక్సెస్‌లతో మళ్లీ అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే తాజాగా ఈ అమ్మడిని ఓ అభిమాని పెళ్లి చేసుకుంటా అనే ప్రపోజల్‌ పెట్టాడు. అంతేకాకుండా మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను అని చిలిపిగా అడిగాడు. దాంతో అభిమాని చిలిపి ప్రశ్నకి కాజల్‌ స్పందించింది.

అంత సులభంగా అవదు, గట్టిగా ట్రై చేయు, ఆల్‌దిబెస్ట్‌ అంటూ షాకింగ్‌గా స్పందించింది. అభిమాని చిలిపి ప్రపోజల్‌కి కాజల్‌ చిలిపి ఆన్సర్‌ ఇచ్చింది. దాంతో ఆ అభిమాని ఆనందం అంతా ఇంతా కాదు. అరే కాజల్‌ ఇంత ఈజీగా స్పందించింది కదా అని ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇక నెటిజన్లు కూడా కాజల్‌ సమాధానం చూసి తెగ మురిసిపోతున్నారు. అయితే మళ్లీ స్పందించడానికి కొందరు ఇదే ప్రశ్నని రిపీట్‌ చేసే వారు కూడా ఉన్నారు.