Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ ఐటెం మారింది..

NTR-Item-kajalఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. ప్రస్తుతం షూటింగ్ చివరి భాగం లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రం లో తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ వాస్తవానికి స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా కాదట అందాల చందమామ కాజల్ అని కన్ఫామ్ చేసారు చిత్ర PRO మహేష్.. అంతే కాదు #A సూపర్ పప్పీ నెంబర్ అంటూ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసి అభిమానులకు తీపి కబురు తెలిపాడు. ఈ పోస్ట్ చూసి అభిమానులు మళ్లీ బృందావనం , టెంపర్ కాంబినేషన్ రిపీట్ అంటూ కామెంట్స్ వేస్తున్నారు.

ఇక సినిమా ఆడియో విషయానికి వస్తే అతి త్వరలోనే అభిమానుల సమక్షం లో ఈ ఆడియో వేడుక జరగబోతుంది. సెప్టెంబర్ 2 న సినిమా రిలీజ్ కాబోతుంది.

Exit mobile version