టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఒక చిత్రంను చేస్తున్న విషయం తెల్సిందే. సౌత్‌లో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ అమ్మడికి అక్కడ దక్కిన పారితోషికం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు. పెద్ద సినిమా అయినా కూడా కాజల్‌కు కేవలం 30 లక్షలు మాత్రమే పారితోషికంగా ఇస్తున్నట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్న కాజల్ ఈ విషయమై నోరు మెదపడం లేదు.
టాలీవుడ్‌లో ఒకప్పుడు రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకున్న ఈ అమ్మడు మరీ దారుణంగా 30 లక్షలకు సినిమా చేయడం ఏంటీ అంటూ కాజల్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్స్‌కు రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు అనేందుకు ఇదే నిదర్శనం. పాపం కాజల్ చాలా కష్టపడి మళ్లీ సౌత్‌లో స్టార్‌డంను ప్రయత్నించుకునేందుకు చూసింది. కాని ఆమెకు టైం కలిసి రాలేదు. ప్రస్తుతానికి ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నా కూడా ఆ చిత్రంపై నమ్మకం ఉన్నట్లుగా అనిపించడం లేదు. ఒకవేళ అది సక్సెస్ అయినా క్రెడిట్ ఖచ్చితంగా ఆమెకు దక్కుతుందనే నమ్మకం అయితే లేదు.