‘కల్కి’ దర్శకుడితో చందమామ

‘అ!’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఈయన మొదటి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక రెండవ చిత్రాన్ని రాజశేఖర్‌ హీరోగా ‘కల్కి’ అంటూ ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించాడు. కల్కి చిత్రం యావరేజ్‌ టాక్‌తో పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఈయన మూడవ సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. మూడవ సినిమాకు సంబంధించి పలు వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే తాజాగా ప్రశాంత్‌ వర్మ ఒక లేడీ ఓరియంటెడ్‌ చిత్రాన్ని చేయబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది.

చందమామ స్టార్‌ కాజల్‌ హీరోయిన్‌గా ప్రశాంత్‌ వర్మ సినిమా ఉండబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ రెడీ అవుతుందని, అతి త్వరలోనే సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఒక యంగ్‌ హీరో కూడా ఉండబోతున్నాడట. కాజల్‌ గతంలో ప్రశాంత్‌ వర్మ మొదటి చిత్రం అయిన అ! లో కూడా నటించింది. ఇప్పుడు మరోసారి ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్నా మరియు కాజల్‌లు నిర్మాతలుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.