Satyabhama : ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ ‘సత్యభామ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?


స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో, సుమన్ చిక్కాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సత్యభామ’. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ అదరగొట్టేసింది. అయితే ఈ సినిమా థియేటర్లలో అనుకున్న రేంజ్ విజయాన్ని సాధించలేదు. కానీ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

Kalki 2898 AD Review | కల్కి2898 AD రివ్యూ

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు ?