ప్రేమకు గుర్తుగా చెప్పుకునే తాజ్ మహల్ ముందు కాజల్ గంతులేస్తూ ఫొటోలకు ఫోజ్ ఇచ్చింది. తనదైన స్టయిల్లో ఫొటోలను దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాహ్ తాజ్ అంటూ కాజల్ ఆ ఫొటోలను పోస్ట్ చేసింది. తాజ్మహల్ ముందు చందమామ భలే ముద్దుగా ఉందంటూ అభిమానులు ఈ ఫొటోలను తెగ వైరల్ చేస్తున్నారు. కాజల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’, ‘పారిస్ పారిస్’ చిత్రంలో నటిస్తోంది.