Site icon TeluguMirchi.com

ఆ ముద్దు మాకొద్దు

lip-kiss-in-kadaliనటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్, సీనియర్ నటి రాధ కుమార్తె తులసి జంటగా తెరంగేట్రం చేస్తున్న సినిమా కడలి. ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. ఇటివల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ లోని ముద్దు సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తమిళ సీనియర్ రచయితలు చారు నివేదిత, జ్ఞాని శంకరన్‌లు పదహారేళ్ల అమ్మాయిని ముద్దు సీన్లలో నటింపజేస్తారా అంటూమణిరత్నం పై మండి పడ్డారు. మైనర్లను ముద్దు సీన్లలో నటింపజేయడం, వారిమధ్య శృంగారంతో కూడిన దృశ్యాలు చూపించడం వల్ల యూత్ చెడిపోయే అవకాశముందని అభిప్రాయ పడ్డారు. అయితే ఈ విమర్శల పై మణిరత్నం ఇంకా స్పందించాల్సివుంది. ఈ లిప్ లాక్ సన్నివేశం ఎంత స్థాయి లో విమర్శలు అందుకుంటుందో అంతే స్థాయి లోపాజిటివ్ రెస్పాన్ కూడా అందుకోవడం విశేషం.

Exit mobile version