180 కోట్లు కొల్లగొట్టిన ‘కబాలి ‘.

kabali-180crవిడుదలకు ముందు ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో , విడుదల తర్వాత అంతే విధంగా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో కబాలి. టాక్ తో సంబంధం లేకుండా విజయాపథం లో దూసుకపోతున్న రజని కబాలి , తాజాగా 180 కోట్లు కొల్లగొట్టినట్లు సమాచారం.

గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా 180కోట్ల వసూళ్లను సాధించి భారతీయ సినీ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది. తెలుగు , తమిళ, హిందీ భాషల్లో 109కోట్ల కలెక్షన్స్ రాబట్టగా , అమెరికా, యూకే, సింగపూర్, గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో 87.5కోట్ల వసూళ్లను రాబట్టింది.

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం తొలివారాంతంలో 165కోట్ల కలెక్షన్స్ రాబట్టగా , ఆ రికార్డును కబాలి తిరగరాసిందని ట్రేడ్ పండితులు చెపుతున్నారు. మొత్తానికి హిట్ తో సంబంధం లేదు అని రజని మరోసారి కబాలి తో నిరూపించాడు.