Site icon TeluguMirchi.com

త్వరపడండి : కబాలి వెండి నాణాలు వచ్చేసాయి..

kabali-sliver-coinsరోజుకో వార్త తో కబాలి చిత్రం పై మరింత అంచనాలు పెంచేస్తున్నారు చిత్ర నిర్మాతలు..ఇప్పటికే కొత్త కొత్త ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్న చిత్ర యూనిట్ తాజాగా వెండి నాణాలతో అందరి దృష్టి పడేలా చేస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది కబాలి చిత్ర యూనిట్. రజినీకాంత్‌ బొమ్మను వెండి నాణేలపై ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచీల ద్వారా సరఫరా చేయాలని డిసైడ్ అయ్యారు.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ ‘కబాలి’ నాణేలను విడుదల చేసిన కార్యక్రమంలో దిగిన ఫొటోలను అప్ లోడ్ చేసింది. ‘ఈ వెండి నాణేలు 5 గ్రాములు (రూ. 350), 10 గ్రాములు(రూ. 700), 20 గ్రాములు(రూ. 1400) చొప్పున అన్ని ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఆఫీస్ లలో లభిస్తాయి. కాకపోతే ఇవి మీ చేతికి సినిమా రిలీజ్ తర్వాత అందుతాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Exit mobile version