Site icon TeluguMirchi.com

ఇండియాలోనే తొలిసారి ఆ రికార్డ్ కొల్లగొట్టిన కబాలి…

kabali_india-recordఇప్పటివరకు సినిమా ప్రచార పోస్టర్ లను గోడల పైన , బస్, ట్రైన్స్ పైన చూసాం..కానీ సరికొత్తగా విమానాల పైన కూడా చూడబోతున్నాం..అది కూడా రజని కబాలి చిత్ర పోస్టర్స్..

ఇప్పటికే ఫస్ట్ లుక్ తోను, టీజర్ తో రికార్డ్స్ బ్రేక్ చేసిన కబాలి , ఇప్పుడు ప్రచార కార్య క్రమాలతోను సరికొత్త రికార్డ్స్ నెలకొల్పబోతుంది..చెన్నైలోని భారీ హోర్డింగ్ లతో పాటు బస్సులు, రైళ్లను కూడా కబాలి పోస్టర్లతో అలంకరించేస్తున్నారు. అవికాకుండా ఇప్పుడు విమానాలకు కూడా కబాలి పోస్టర్స్ అత్తికించేస్తున్నారు. రెండు డొమాస్టిక్ ఫ్లైట్స్తో పాటు, మరో రెండు ఇంటర్ నేషనల్ ఫ్లైట్స్కు కబాలి పోస్టర్స్ వేస్తున్నారు. గతంలో హాలీవుడ్ సినిమా హాబిట్ కోసం ఈ తరహా ప్రచారం చేయగా, ఇండియాలో మాత్రం కబాలినే తొలిసారిగా ఈ రికార్డ్ సొంతం చేసుకోనుంది. ఇంతయినా రజిని నా మజాకా…

Exit mobile version