Site icon TeluguMirchi.com

కబాలి తెలంగాణ లో ఎన్ని థియేటర్స్ రిలీజ్ అవుతుందో తెలుసా..?

kabali-release-dateమరో రెండు రోజుల్లో అసలైన పండగ రాబోతుంది అదే కబాలి పండగా..రజనీకాంత్ నుండి సరైన హిట్ చూసి చాలా కాలం అయ్యింది. ఈ నేపథ్యం లో పా. రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కిన కబాలి చిత్రం పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు రజని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు.

ఈ అంచనాల అనుగుణంగానే సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది. దీనికి తగ్గట్టే నైజాం హక్కుల్ని దక్కించుకున్న అభిషేక్ పిక్చర్స్ వారు నైజాంలో రికార్డు స్థాయిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.దాదాపు 3 నుండి 4 వందల థియేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. నైజాంలో రజనీకాంత్ సినిమా ఈ స్థాయిలో విడుదలకానుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

కేవలం నైజాంలోనే కాదు, ఇండియా అంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో రజనీ మేనియా ఓ రేంజ్ లో ఉంది. అమెరికా, ఆస్ట్రేలియాల్లో అత్యధిక స్క్రీన్స్ పై కబాలిని తెరపైకి తెస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించి అన్ని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ పూర్తయింది. కొన్ని హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఇలా విడుదలకు ముందు బుకింగ్స్ క్లోజ్ అవుతాయి. కానీ కబాలి మాత్రం హాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా చూసి రజని నా కబాలి నా అంటున్నారు.

Exit mobile version