Site icon TeluguMirchi.com

క‌బాలి కి నెగిటివ్ టాక్..?

kabali-negitiv-talkతమిళ తలైవా రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం రేపు విడుదల కాబోతుంది. రిలీజ్ కు ముందే 200 కోట్ల బిజినెస్ సాధించిన ఈ చిత్రం , విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని అభిమానులతో పాటు సినీ పరిశ్రమలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్ప‌టికే కొన్ని బ‌య‌ట దేశాల్లో ఈ సినిమా ప్రీమియ‌ర్ షోల‌ను వేయడం జరిగింది. ఈ షోల టాక్ ప్రకారం ఓవ‌ర్సీస్ సినీ విశ్లేష‌కులు సినిమా ఫై అంచనా వేస్తున్నారు. ర‌జ‌నీ అభిమానులకు కబాలి ఫుల్ భోజనం పెట్టిన కానీ సాధారణ ప్రేక్ష‌కులు మాత్రం కాస్త నిరాశ త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

క‌థ‌, క‌థ‌నం బాగుండడం సినిమాకు ప్ల‌స్ పాయింట్ అయితే కొన్ని లోపాలు మాత్రం సినిమా వేగాన్ని త‌గ్గించాయని వారు చెపుతున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ తో పాటు క్లైమాక్స్ కాస్త నిరాశ‌ప‌రిచే విధంగా ఉంద‌ని బలంగా చెపుతున్నారు. కాకపోతే క్లైమాక్స్ లో వచ్చే ఊహించ‌ని ట్విస్ట్ ర‌జ‌నీ అభిమానుల‌తో పాటు సాధారణ ప్రేక్ష‌కుల‌కు కూడా షాకింగ్ గా ఉంటుందని అంటున్నారు.

చాలా కాలం తర్వాత రజనీకాంత్ లో పూర్తి స్థాయి ఎన‌ర్జీ కనపరిచాడని టాక్. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ర‌జ‌నీ యంగ్ గెట‌ప్ కొంచెం అప్ సెట్ చేసిన‌ట్టు ఉంటుంది. ఓవరాల్ గా సినిమా టాక్ చూస్తే 50 – 50 అంటున్నారు. చూద్దాం రజని ఏ మాయ చేస్తాడో..మొదట్లో రోబో కూడా ఇదే మాదిరి టాక్ వినిపించిన సినిమా రిలీజ్ తర్వాత ఆ టాక్ నే మార్చింది.

Exit mobile version