రజని ఖాతాలో మరో డిజాస్టర్..?

kabali-disterకోట్లాది రజని అభిమానులు ఈరోజు పండుగా చేసుకుంటున్నారు. ఎన్ని రోజులుగా ఎదురు చూసిన ‘కబాలి ‘ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. అర్ధరాత్రి నుండే థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలాలు , సంబరాలు మొదలయ్యాయి.

ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే కాస్త అభిమానులు నిరాశగానే ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే గత చిత్రాలు రజనికి భారీ ఫ్లప్ ను తెచ్చాయి. ఈ నేపథ్యం లో కబాలి చిత్రం పై అభిమానులే కాదు సినిమా పరిశ్రమలు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలు అందించడం లో డైరెక్టర్ పా. రంజిత్ విఫలం అయ్యాడని బలంగా చెపుతున్నారు. ఇక సోషల్ మీడియా లో అయితే కొంతమంది బాగుంది అంటున్న చాలా మంది మాత్రం మరో లింగా అని తేల్చేస్తున్నారు. ‘నిప్పురా ..అంటూ రజిని అంటే వర్ష కాలం కదా బ్రదర్ అందుకే తుస్సు అన్నది ‘ అంటూ కామెంట్స్ వేస్తున్నారు. మొత్తానికి రజిని ఖాతాలో మరో డిజాస్టర్ తప్పదేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చూద్దాం చివరికి ఏ టాక్ తో పూర్తి అవుతుందో.