కబాలి ఫ్లాప్ తో ఆ హీరో పండగా చేసుకుంటున్నాడు..

kabali-jakkannaఎన్నో అంచనాలు పెట్టుకున్న కబాలి చిత్రం ఫ్లాప్ కావడం తో చిత్ర యూనిట్ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా రజని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం బాధ పడుతుంటే ఒక హీరో మాత్రం హ్యాపీ గా ఫీల్ అవుతున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో మీరే చూడండి..

గత కొంతకాలంగా ఒక్క హిట్ లేకుండా కష్టాలు అనుభవిస్తున్న హీరో సునీల్ , ఇప్పుడు ఆశలన్నీ జక్కన్న మీదనే పెట్టుకున్నాడు. ఇది హిట్ అయితే తప్ప సునీల్ ఇండస్ట్రీ లో నిలబడడం కష్టం. ఈ సంగతి అతడికి కూడా తెలుసు. దీంతో జక్కన్న హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు.

కాగా రజని నటించిన కబాలి చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడం తో ఈ సినిమా హిట్ అయితే జక్కన్న కు ఇబ్బందులు తప్పవని , సరయిన థియేటర్స్ దొరకవని ఖంగారు పడ్డాడు. కానీ కబాలి వచ్చింది కానీ హిట్ టాక్ మాత్రం సొంతం చేసుకోలేకపోవడం తో పెద్ద గండం గడిచిందని అనుకుంటున్నాడట. ఒకవేళ కబాలి హిట్ అయితే సునీల్ కు కష్టాలు వచ్చేవేమో.