‘కబాలి’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

Kabali-1st-reviewరజనీకాంత్ నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రం ‘కబాలి ‘ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్ రివ్యూ & రేటింగ్ బయటకు వచ్చేసింది.

ఏకంగా 4 స్టార్ రేటింగ్ ఇవ్వడమే కాదు సూపర్ హిట్ అని తేల్చేసారు. ఇంకా కబాలి రిలీజ్ కాలేదు, కనీసం బెనిఫిట్ షోలు కూడా ఎక్కడ పడలేదు… అప్పుడే సినిమా ఎవరు చూసారు? రేటింగ్ ఎలా ఇచ్చారు అనే సందేహం మీకు రావొచ్చు. ఈ రివ్యూ రాసింది ప్రముఖ ఇండియన్ మేగజైన్ ఎడిటర్ & యూకె సెన్సార్ బోర్డ్‌లో సభ్యుడు అయిన ఉమైర్ సంధు తన ట్విట్టర్ లో రివ్యూ రాసారు. ఇప్పుడు ఈ రివ్యూ ట్వీట్స్ సినీ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పటికే సినిమా ఫై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు ఈ రేటింగ్ & టాక్ తో ఫుల్ ఖుషి గా ఉన్నారు.