Kaantha : దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ మూవీ ‘కాంత’ ఇప్పటికే అద్భుతమైన స్టార్ కాస్ట్ మరియు ఇంట్రస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా ప్రేమికుల్ని ఆకట్టుకుంటోంది. లీడ్ పెయిర్‌గా దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సేల స్టన్నింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసిన మేకర్స్, ఇప్పుడు ఈ సినిమా నుండి మరో కీలక పాత్రను పరిచయం చేశారు. వెరీ ట్యాలెంటెడ్ సముద్రఖని పుట్టినరోజు సందర్భంగా, చిత్రబృందం అతని ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. మోనోక్రోమ్ ప్యాలెట్‌లో డిజైన్ చేసిన ఈ పోస్టర్‌లో సముద్రఖని ఫెరోషియస్ అవతార్‌లో కనిపించారు. ఆయన స్టైలింగ్, హావభావాలు సినిమా కథనంలో ఆయన పాత్రకు ఎంత బలం ఉండబోతోందో హింట్ ఇస్తున్నాయి.
Also Read : Sharwa38 : శర్వానంద్ కు జోడిగా అనుపమ పరమేశ్వరన్..
ప్రస్తుతం ‘కాంత’ షూటింగ్ పూర్తయింది, పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. గొప్ప కథ, అద్భుతమైన నటీనటులు, టాప్ టెక్నికల్ టీం కలిసి ఈ సినిమాను మస్ట్ వాచ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌గా రూపొందించాయి. ఈ చిత్రాన్ని తెలుగులో రానా దగ్గుబాటి ప్రొడ్యూ్స్ చేస్తున్నారు. త్వరలోనే మేకర్స్ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ‘కాంత’ పీరియాడికల్ డ్రామాల అభిమానులకు మరొక గొప్ప సినిమా అనుభూతిని అందించబోతోంది.