‘కాలా ‘ సెన్సార్ రిపోర్ట్

సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి సినిమా వస్తుందంటే అభిమానులు సంబరాలు చేసుకుంటుంటారు. ముఖ్యం గా తమిళనాట ఓ పండగల భావిస్తారు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటారు. ప్రస్తుతం రజని నుండి రాబోతున్న చిత్రం కాలా. కబాలి ఫేమ్ పా. రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకున్న జూన్ 7 న విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యం లో ఈ మూవీ తమిళ సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. అలాగే సినిమా రన్ టైం విషయానికి వస్తే 166 .59 నిముషాలు ఉన్నట్లు తెలుస్తుంది.

మురికివాడల నేపథ్యంలో రూపొందగా, ఈ చిత్రంలో రజనీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటిస్తున్నాడు. అలాగే తమిళ నటుడు సముద్ర‌ఖ‌ని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరో ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.