Site icon TeluguMirchi.com

షాక్ : రజనీ కాలా క్లైమాక్స్ లీక్


రజనీకాంత్‌ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కాలా’. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం క్లైమాక్స్ సన్నివేశానికి సంబంధించిన వీడియో లీక్‌ అయ్యింది. ఎడిట్‌ చేయని ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్లో చక్కర్లు కొడుతోంది. దీంతో యూనిట్ షాక్‌కు గురయ్యారు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా ఇలా పుటేజ్ లీక్ అవ్వడం షాక్ కు గురి చేసింది

ఇందులో తలైవా గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను రజనీ అల్లుడు, నటుడు ధనుష్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రజనీ సరసన హ్యూమా ఖురేషీ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో మరో ఇద్దరు బాలీవుడ్‌ నటులు పంకజ్‌ తివారీ, నానా పటేకర్‌ నటిస్తున్నారు. నానా పటేకర్‌ విలన్‌గా, పంకజ్‌ పోలీస్‌ అధికారిగా కన్పించనున్నారు. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించారు. ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించేసింది.

Exit mobile version