చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దివంగత ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మీ(86) గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నెల 2వ తేదీనే విశ్వనాథ్ కన్నుమూయగా.. 24 రోజులలోనే ఆయన భార్య తుది శ్వాస విడవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే, ఆయన మృతి చెందినప్పటి నుంచి జయలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటు రావడంతో మరణించారు. ఇక ఆమె మరణ వార్త తెలుసుకున్న ప్రముఖులు ఆమె మరణానికి చింతిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.