Site icon TeluguMirchi.com

ప్లీజ్‌… దర్శకులారా అలా చూపించొద్దు

jyothika2తెలుగు, తమిళ భాషల్లో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన జ్యోతిక ఆ తర్వాత తమిళ స్టార్‌ హీరో సూర్యను పెళ్లాడి గతకొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ వస్తోంది. తల్లి అయ్యాక జ్యోతిక మళ్లీ వెండి తెర మీదకు రాబోతుంది. జ్యోతిక తాజాగా ‘మగలిర్‌ మట్టుం’ చిత్రంలో నటించింది. ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవలె జరిగింది. చాలాకాలం తర్వాత వేదిక మీద మాట్లాడిన జ్యోతిక దర్శకులను రిక్వెస్ట్‌ చేస్తోంది. కురుచ దుస్తులతో హీరోయిన్‌లతో ఆడుకోకండి, వారికి వేసుకోవడానికి మంచి దుస్తులను ఇవ్వండి ప్లీజ్‌ ఇది నా రిక్వెస్ట్‌ అని దర్శకులను బతిమిలాడుతుంది.

హీరోయిన్లకు ఎలాగు నిండైన దుస్తులను ఇవ్వరు కానీ కనీసం వారితో మంచి మాటలు చెప్పించండి. హీరోల వెంట పడుతూ మమ్మల్ని ప్రేమించండి అని, హీరోయిన్ల చేత డబుల్‌ మీనింగ్‌ డైలాగులను పలికిస్తున్నారు. హీరోయిన్లను అలా చూపడం వల్ల అది యూత్‌ మీద ప్రభావం చూపిస్తుంది. ప్లీజ్‌.. దర్శకులారా అలా చూపించొద్దు. ఇకనైనా మీ పద్దతి మార్చుకుని హీరోయిన్లను కాస్త పద్దతిగా చూపించండి అంటూ జ్యోతిక దర్శక నిర్మాతలను రిక్వెస్ట్‌ చేస్తుంది. అయినా ఇది నీ కాలం కాదు లే జ్యోతిక నీ మాట ఎవరు పట్టించుకుంటారు చెప్పు..?? హీరోయిన్లు చాలామంది కూడా అవకాశాల కోసం అన్ని విప్పడానికి కూడా సిద్దంగా ఉన్నారు. సో వారిని కొంతమంది దర్శకులు అలా వాడుకుని సినిమాల్లో గ్లామర్‌గా చూపిస్తారు.

Exit mobile version