Site icon TeluguMirchi.com

Devara : ‘దేవర’ సెకండ్ సింగిల్ రిలీజ్.. ఎన్టీఆర్, జాన్వీల రొమాన్స్ నెక్స్ట్ లెవెల్..


Devara Second Single : జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవ‌ర’ కోసం అభిమానులు ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ప్ర‌తిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వ‌చ్చిన ‘జ‌న‌తాగ్యారేజ్’ సూప‌ర్ హిట్ కావ‌డంతో ‘దేవ‌ర‌’ పై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఇక ఇప్ప‌టికే రిలీజైన ఈ చిత్ర పోస్ట‌ర్స్, ఫ‌స్ట్ సింగిల్, టీజ‌ర్ ల‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.

Also Read : డబుల్ ఎనర్జీతో ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్.. ఇక మాస్ జాతరే !

‘చుట్టమల్లె..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌, అందులోని విజువ‌ల్స్‌ ఫ్యాన్స్‌కి, ప్రేక్ష‌కుల‌కు పెద్ద ట్రీట్‌లా ఉంది. ఎన్టీఆర్‌, జాన్వీ జంట పాట‌లో రొమాంటిక్‌గా క‌నిపించ‌టం అభిమానుల‌కు క‌నువిందుగా ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. బీచ్ తీరంలో ఎన్టీఆర్ డాన్స్‌, జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ అవ‌తార్‌లో క‌నిపిస్తూ, వినసొంపుగా ఉన్న పాట మ‌న‌సును హ‌త్తుకుంటోంది. బాస్కో మార్టిస్ కొరియోగ్ర‌ఫీ చూడ‌టానికి సింపుల్‌గా క‌నిపిస్తూనే క‌ళ్లు తిప్పుకోనీయ‌ట్లేదు. ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి అద్భుతంగా రాశారు. అనిరుద్ ర‌విచందర్ సంగీత సార‌థ్యంలో పాట‌ను శిల్పా రావ్ ఎంతో శ్రావ్యంగా పాడారు.

Also Read : Filmfare Awards : 6 ప్రెస్టిజియస్ విన్స్ తో నాని ‘దసరా’ మూవీ రికార్డు

ఇక ఈ సినిమాను నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో భారీ అంచ‌నాల‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ హై యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ను రెండు భాగాలుగా రూపొందిస్తుండగా అందులో ‘దేవర: పార్ట్ 1’ ను తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు.

Exit mobile version