Site icon TeluguMirchi.com

కొరటాల శివ తో ఎన్టీఆర్…?

NTR-Koratala-Movieమిర్చి చిత్రం తో ఒక్కసారిగా పెద్ద డైరెక్టర్స్ లిస్టు చేరిన దర్శకుడు ‘కొరటాల శివ’. ప్రస్తుతం మహేష్ బాబు తో శ్రీమంతుడు అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల చివరి వారంలో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని జూన్ లో రిలీజ్ కాబోతుంది. అప్పుడే కొరటాల తదుపరి చిత్రం గురించి చర్చలు మొదల్లయ్యాయి.

తాజాగా ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రీమంతుడు తర్వాత ఎన్టీఆర్ తో ఈ దర్శకుడు ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ వినపడుతుంది. నిజానికి రామయ్యావస్తావయ్యా చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. అయితే ఈలోపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ టెంపర్ సినిమా చేయడం, అదే టైం లో మహేశ్ బాబు తో శ్రీమంతుడు చిత్రానికి కొరటాల శివ కమిట్ అవడంతో.. ఈ కాంబినేషన్ వాయిదా పడింది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళుతోంది. ఈ సినిమా పూర్తయ్యాకే ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళుతుందన్నమాట.

Exit mobile version