Site icon TeluguMirchi.com

అన్నగారి బాట(కోటు)లో మనవడు..

jr-ntr-as-justic-chowdary“చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో….’ ఈ పాట గుర్తుకు తెచ్చుకుంటే మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యే రూపం నల్లకోటులో, నోటిలో పైపులో న్యాయానికి చిహ్నంగా కనిపించే నందమూరి తారక రామారావు గారి జస్టిస్‌ చౌదరి అవతారం. ఇప్పుడు అదే అవతారంలో అన్నగారి మనవడు జూనియర్‌ ఎన్టీయార్‌ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలను మూటకట్టుకుని ఓ స్పెషల్‌ ప్యాకేజీగా ఏప్రిల్‌ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న బాద్‌ షా చిత్రంలో తారక్‌ జస్టిస్‌ చౌదరిగా కనిపించబోతున్నట్టు సమాచారం. బాద్‌ షా సెకండాఫ్‌ లో కొద్దిసేపు అలా దర్శనమివ్వబోతున్నాడట జూనియర్‌. ఇదివర్కు ఓసారి యమదొంగ చిత్రంలో యమలోకంలో తాతగారి పక్కన స్టెప్పులేసి మురిపించిన ఈ నందమూరి చిన్నోడు ఇప్పుడు తాత పాత్రలోనే కనిపించబోతుండడం నిజంగా నందమూరి అభిమానులకు ఓ పండగే మరి. చిత్రంలో ఈ సన్నివేశం కేవలం కొద్ది నిమిషాలే ఉన్నా, అది చిత్రానికి కీలకమయినదని యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి తారక్‌ అవతారం చూసి తరించాలంటే మాత్రం ఏప్రిల్‌ 5వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే!

Exit mobile version