అమెరికా రెస్టారెంట్లో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న తారక్


ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ కొద్దిగా గ్యాప్ తీసుకున్న సంగతి తెల్సిందే. కొరటాల శివతో సినిమా ఇంకాస్త సమయం పట్టేలా ఉండడంతో ఈలోపు ఎన్టీఆర్ కుటుంబంతో వెకేషన్ కు వెళ్ళిపోయాడు. గత కొన్ని రోజులుగా అమెరికాలో భార్య మరియు పిల్లలతో సరదాగా క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేస్తున్న ఎన్టీఆర్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. న్యూయార్క్‌లోని జునూన్ అనే ప్రసిద్ధ భారతీయ రెస్టారెంట్ ను విజిట్ చేసిన ఎన్టీఆర్.. అక్కడ ఉన్న చెఫ్స్ తో ఫోటో దిగి షేర్ చేశాడు. ” విదేశీ పర్యటనలో ఉన్న ఇండియన్స్ కు ఇంత కంటే బెస్ట్ ఇండియన్ ఫుడ్ ఎక్కడ లభించదు.. జునూన్, న్యూయార్క్ లో అమేజింగ్” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.