జోడీ అనే ఒక మ్యాగజైన్ కవర్ పేజ్‌పై ఈ ఫొటోను వేయడం జరిగింది. కెనడా నుండి మెవడే ఈ మ్యాగజైన్‌లో పెళ్లి సంబంధాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ మ్యాగజైన్ ప్రమోషన్ కోసం, ఎక్కువ సంఖ్యలో ఆ మ్యాగజైన్‌ను కొనాలనే ఉద్దేశ్యంతో సదరు కంపెనీ వారు ఇలాంటి కవర్‌ను వేశారు. అయితే ఈ ఫొటోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. చీరను ఇలా కట్టడం ఏంటి, రెండు కాళ్లు తొడల వరకు బయటకు కనిపించేలా చీర కట్టడం ఏంటి, విదేశాల్లో భారత దేశం పరువు తీయడం తప్ప ఇది మరోటి కాదు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీరకు ఉన్న అంతర్జాతీయ గుర్తింపును ఇలాంటి చీప్ పనులు చేసి పాడు చేయవద్దని కొందరు కోరుతున్నారు.