Site icon TeluguMirchi.com

చరణ్ కి జిగేలు రాణి గిఫ్ట్

రామ్ చరణ్ బర్త్ డే కి జిగేలు రాణి గిఫ్ట్ ఇచ్చింది. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వం వహించారు. సమంత కథానాయిక. ఈ చిత్రంలోని ఐటెం నెంబర్ లో పూజా హెగ్డే ఆడిపాడిన సంగతి తెలిసిందే. మంగళవారం చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ పాట ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది.

ఇందులో చెర్రీ, పూజ సెప్టులతో అదరగొట్టేశారు. ‘జిగేలు రాణి’గా పూజ డ్యాన్స్‌ మెగా అభిమానులతో కెవ్వు కేక అనిపించేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ‘రంగస్థలం’ చిత్రాన్ని నిర్మించింది. మార్చి 30న సినిమా విడుదల కాబోతోంది.ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

Exit mobile version