జాన్వీ పెళ్లి ఎక్కడ జరగనుందో తెలుసా?

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి ఫామ్‌తో దూసుకు పోతుంది. మొదటి సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకోలేక పోయినా కూడా ఆమెకు నటిగా మంచి గుర్తింపు అయితే దక్కింది. ఆ సినిమా తర్వాత వరుసగా చిత్రాలు చేస్తూనే ఉంది. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్‌ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. తనకు సౌత్‌ ఇండియాపై ఉన్న అభిమానంను మరోసారి చాటుకుంది.

తన పెళ్లి గురించి జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ నా పెళ్లి ఖచ్చితంగా తిరుపతిలో జరుగుతుంది. కంచి పట్టు చీర కట్టుకుని నేను పెళ్లి చేసుకుంటాను. అలాగే నా పెళ్లికి ఇడ్లీ సాంబార్‌తో పాటు సౌత్‌ వంటకాలను రుచి చూస్తానంటూ చెప్పుకొచ్చింది. శ్రీదేవికి తిరుపతి అంటే చాలా ఇష్టం. ప్రతి ఏడు ఏదో ఒక సందర్బంలో తిరుపతి వస్తూనే ఉండేవారు. ఆమె మాదిరిగానే జాన్వీ కపూర్‌ కూడా తిరుపతిపై మమకారం పెంచుకుంది. తరచు వస్తూనే ఉంది. అలాగే పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది.