సౌత్ సినిమాల ఫై జాన్వీ క్లారిటీ

ధ‌డ‌క్ మూవీ తో హిట్ అందుకున్న జాన్వీ కపూర్..తాజాగా సౌత్ సినిమాలో అది కూడా వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ సరసన నటించబోతుందనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొట్టడం తో అంత ఇది నిజమే అనుకున్నారు. కానీ ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అసలు సౌత్ సినిమాల ఫై ఇప్పట్లో దృష్టి పెట్టాలని అనుకోవడం లేదని జాన్వీ క్లారిటీ ఇచ్చింది.

నేరుగా విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించని ఈ బ్యూటీ, ఇప్పట్లో తనకు సౌత్ సినిమాలు చేసే ఉద్దేశం లేదని క్లియర్ గా చెప్పేసింది. ప్రస్తుతం తన ఫోకస్ అంత హిందీలోనే మరిన్ని సినిమాలు చేయాలనీ ఉందని , బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అప్పుడు సౌత్ సినిమా గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది. వాస్తవానికి ఎవరైనా ఉత్తరాది భామలు ముందుగా సౌత్ సినిమాలు చేసి వారి నటనను మెరుగుపరుచుకుంటారు. కానీ జాన్వీ మాత్రం రివర్స్ గా సౌత్ సినిమాలు ఇప్పుడే వద్దంటూ కొత్తగా మాట్లాడుతుంది.