నాకు సారా పోటీ కాదు, ఫ్రెండ్

జాన్వి కపూర్‌ ధడక్‌ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అలనాటి తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ ను కరణ్ జోహార్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన మొదట సినిమానే 100 కోట్ల క్లబ్ లోకి చేరడం తో బ్లాక్ బస్టర్‌ హిట్‌ అయ్యింది. మళ్ళి కరణ్ జోహార్ నిర్మించనున్న ‘తఖ్త్‌’ చిత్రంలో జాన్వి తన రెండో అవకాశం దక్కించుకున్నారు. ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌, విక్కీ కౌశల్‌, కరీనా కపూర్‌, ఆలియా భట్‌, భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ కూడా కేదార్‌నాథ్‌, సింబా సినిమాలతో ఇండస్ట్రీ కి పరిచయం అవుతుంది. జాన్వి మొదటి సినిమాతోనే స్టార్‌ అవ్వడంతో ఆమెను పలు మీడియా వర్గాలు సారాతో పోలుస్తున్నాయి.

దీనిపై జాన్వి స్పందిస్తూ..‘నాకు సారాకు మధ్య పోటీ ఏంటి? మేమిద్దరం మంచి స్నేహితులం. అయినా కొందరికి ఇలా పోల్చి చూడటం నచ్చుతుందేమో. ఇదే ప్రశ్నను నా సహనటుడు ఇషాన్‌ను ఎందుకు అడగరు, ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయకండి అని వెల్లడించారు.