ప్రతినాయకుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు జగపతిబాబు. లెజెండ్‌లో ఎప్పుడైతే విలన్ గా టర్న్ తీసుకొన్నాడో అప్పటి నుంచీ జగపతి హవా నడుస్తోంది. రారా కృష్ణయ్య, పిల్లా నువ్వు లేని జీవితం సినిమాల్లోనూ జగపతి కీలక పాత్రలు పోషిస్తున్నాడు. రెండింటిలోనూ నెగిటీవ్ టచ్ ఉంది. ఇప్పుడు జగపతికి బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. ప్రభుదేవా అక్కడ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రతినాయకుడి పాత్ర కోసం జగపతిని ఎంచుకొన్నట్టు సమాచారమ్. ఈరోజు ముంబైలో జగపతిబాబుపై ఫొటో షూట్ జరుగుతోందట. ఆ తరవాతే… చిత్రబృందం జగపతిబాబు ఎంపికపై ఓ స్పష్టమైన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ ఇన్నింగ్స్‌లో జగపతి తన రేంజ్ చూపిస్తున్నాడు.