తారక రాముడి కోసం ట్రాఫిక్ జాం…

janata-jamఏంటి టైటిల్ చూసి ఎవరా ఆ తారక రాముడు అనుకుంటున్నారా..ఇంకేవారండి మన నందమూరి ఎన్టీఆర్…తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం షూటింగ్‌ చెన్నైలో జరుగుతోంది. ఇది తెలుసుకున్న చెన్నై ఎన్టీఆర్ అబిమానులు అతడిని చూడడానికి బారులు తీరుతున్నారు..దీంతో ట్రాఫిక్ జాం అయ్యిందని చిత్ర నటుడు బ్రహ్మాజీ తన ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపాడు..

janatha-jam2
అంతే కాదు వీరిలో ఎక్కువగా మహిళలు ఉండడం , గంటల తరబడి ఎన్టీఆర్ కోసం వేచి ఉండడం అందర్ని ఆశ్చర్య పరుస్తుంది..అబిమానుల తాకిడి తో షూటింగ్ కు అంతరాయం ఏర్పడుతుంది..అయిన కానీ ఎన్టీఆర్ మాత్రం ఓపికతో వచ్చిన వారిని పలకరిస్తూ తన ప్రేమను పంచుతున్నాడు..

కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ఎన్టీఆర్ సరసన సమంత , నిత్య మీనన్ నటిస్తున్నారు.