జనతా గ్యారేజ్‌ స్టొరీ ముందుగా ఆ హీరో కి చెప్పాడట..

surya-janthaఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్‌ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..అయితే ఈ చిత్రం గురించి ఆసక్తి కరమైన న్యూస్ ఇటివల జరిగిన 24 ఆడియో వేడుకలో వెలుగులోకి వచ్చింది..ఆడియో ఫంక్షన్ లో సూర్య మాట్లాడుతూ ” జనతా గ్యారేజ్‌ చిత్రం గురించి తనకు తెలుసాని, సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని, చిత్ర యూనిట్ కు ముందుగానే కంగ్రాట్స్ చేపుతునానని చెప్పడం తో అందరు ఆశ్చర్యపోయారు..ఓ తమిళ హీరో కి మన సినిమా గురించి ఎలా తెలుసాని అనుకున్నారు..

కానీ వాస్తవానికి ఈ కథ ను ముందుగా సూర్య కు చెప్పాడట కొరటాల. కానీ సూర్య డేట్స్ కుదరకపోవడం తో వెంటనే ఎన్టీఆర్ కు చెప్పి ఒకే చేయించాడట. అందుకే ’24’ ఆడియో వేడుకకి కొరటాల అతిథిగా వచ్చాడని తెలుస్తుంది.