Site icon TeluguMirchi.com

‘జనతా’ తో జాక్ పాట్ కొట్టేసిన మోహన్ లాల్..

Janatha-Garage-malayalamచాలా ఏళ్ల తర్వాత మోహన్ లాల్ తెలుగు లో నటిస్తున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’..ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ లతో అంచనాలు రెట్టింపు అయ్యాయి..ఇక ఈ చిత్రాన్ని తెలుగు , మలయాళం లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే..మలయాళ హక్కులను మోహన్ లాల్ కొనేయడం తో అక్కడ కూడా సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి..ఈ నేపథ్యం లో జనతా తో మోహన్ లాల్ కు కాసుల పంటే అని అక్కడి సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు..

ఎందుకంటే ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ ద్వారానే మూడు నుంచి మూడున్నర కో్ట్లు వచ్చే అవకాశం ఉందట అంతే కాదు థియేటర్ రైట్స్ రూపంలో ఆరేడు కోట్లు వస్తాయని అక్కడి సినీ ప్రముఖులు అంచనాలు వేయడం తో కేవలం రెండున్నర కోట్ల కు రైట్స్ కొన్న మోహన్ లాల్ , మరో ఏడెనిమిది కోట్లు పక్కన వేసుకుంటున్నాడు అన్న మాట.

Exit mobile version