Site icon TeluguMirchi.com

భోళా శంకర్ – ‘జామ్ జామ్ జజ్జనక’ సాంగ్ రిలీజ్.. మెగాస్టార్ ఇరగదీసాడుగా !


మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. ఏకె ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యింది. ఇక మెగా స్టార్ చిరంజీవి డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి ఇటివలే విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది. ఇకపోతే రెండు రోజుల క్రితం ఈ మూవీ నుండి ‘జామ్ జామ్ జజ్జనక’ అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ప్రోమోని విడుదల చేసిన మేకర్స్, తాజాగా నేడు ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరికల్ వీడియోని విడుదల చేసారు.

ఇక ‘జామ్ జామ్ జజ్జనక’ అంటూ సాగె ఈ పాటలో మెగాస్టార్ తన స్టైలిష్ స్టెప్పులతో ఇరగదీశారు. చిరుతో పాటు తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కూడా మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అంతేకాదు మధ్యలో గొట్టె క‌న‌క‌వ్వ పాపుల‌ర్ సాంగ్ ‘న‌ర్స‌పల్లె..’ ని కూడా వాడారు. ఇక ఈపాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లి ఆలపించగా, కాసర్ల శ్యామ్ రచించారు. ఈ సినిమాలో మెగాస్టార్ టాక్సీడ్రైవర్ గా కనిపించనున్నారు.

ఇక మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నఈ సినిమాలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా, చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తుండగా.. రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, బిత్తిరి సత్తి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Jam Jam Jajjanaka Lyrical | Bholaa Shankar | Mega Star Chiranjeevi |Meher Ramesh| Mahati Swara Sagar

Exit mobile version