జ‌క్కన్నా.. జ‌ర జాగ్ర‌త్త‌!!

rajmouli-baahubaliమంది ఎక్కువ అయితే మ‌జ్జిగ ప‌ల‌చ‌బ‌డుతోంది… అన్నసామెత తెలియంది కాదు. కానీ బాహుబ‌లి విష‌యంలో అదే జ‌రుగుతోంది. ప్రభాస్‌, రానా, అనుష్క‌, సుదీప్‌, శ్రీ‌దేవి, స‌త్యరాజ్‌…. ఇలా ఆయా పాత్రల‌కు స్టార్లనే ఎంచుకొన్నాడు రాజ‌మౌళి. ఈ లిస్టు మ‌రింత పెరిగే అవ‌కాశాలున్నాయి. భారీ తారాగ‌ణం ఈ సినిమాపై మ‌రింత ఒత్తిడి తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అంతమంది ఉన్నారు… సినిమా ఏలెవిల్లో ఉంటుందో?? అని అభిమానులు మ‌రింత ఆశలు పెంచుకొంటారు. ఇంత మందికి స‌రైన పాత్రలు తయారు చేయ‌డం, ప్రతి పాత్రనీ పండించ‌డం రాజ‌మౌళిలాంటి ద‌ర్శకుడికి సాధ్యమే. కానీ పాత్రల పంపకంలో కాస్త తేడా జ‌రిగినా… దొరికిపోయే ప్రమాదం ఉంది. చాలా సినిమాల్లో హేమా హేమీల‌ను ప‌ట్టేసుకొంటారు. ప్యాడింగ్ బాగుంటుంద‌ని.! అయితే ఏ పాత్ర ఎందుకొచ్చిందో, ఎందుకు వెళ్లిందో అర్థం కాదు. ‘బాద్‌ షా’ సినిమాలో అదే జ‌రిగింది. అందులో లెక్కకు మించిన పాత్రలు క‌నిపిస్తాయి. సినిమా అయిపోయాక ఎన్టీఆర్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్ పాత్రలు త‌ప్ప మ‌రోటి గుర్తుండ‌దు. మరి ఈ త‌ప్పు త‌న సినిమాలో జ‌ర‌క్కుండా జ‌క్కన్న జాగ్రత్త ప‌డ‌తాడో లేదో మ‌రి!?