జై లవకుశ టీజర్ టాక్

ఎన్టీఆర్ నటించిన జై లవకుశ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ చెప్పిన టైంకే విడుదల చేసారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసందే..దానికి తగట్టే మూడు పాత్రలకు సంబదించిన టీజర్లకు రిలీజ్ చేయనున్నారు. ముందుగా ‘జై’ కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసారు.

టీజర్ విషయానికి వస్తే..ఈ రోల్ సినిమా లో విలన్ అని తెలుస్తుంది. ఇప్పటివరకు హీరోగా మెప్పించిన ఎన్టీఆర్ , తనలోని విలనిజాన్ని కూడా ఓ రేంజ్ లో చూపించాడు. ”ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణుడ్ని సంపాలంటే.. సముద్రమంత ధ ధ ధ ధ ధైర్యం ఉండాలా” అంటూ నత్తి నత్తి గా చెప్పడం.. మనోడి కలిగించే భయాన్ని చూపించింది. ఈ ఒక్క టీజర్ చాలు సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడానికి…

చేశారు. బాబి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో, కల్యాణ్‌రామ్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ‘జై లవకుశ’ సినిమాకు ప్రారంభం నుంచే అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ టీజర్ తో సినిమా ఫై మరిన్ని అంచనాలు పెంచాయి. మీరు కూడా ఆ టీజర్ ఫై లుక్ వెయ్యండి..