హరికృష్ణ మాట్లాడుతూ.. ఒక రోజు కళ్యాణ్ రామ్, జానకిరామ్ మాట్లాడుకుంటూ తాతగారి పేరుమీద బ్యానర్ పెట్టాం. అందుకు తగ్గట్లుగా సినిమాలు చేయాలి. అందుకే ఆయన పేరు పెట్టుకున్న తమ్ముడిని హీరోగా పెట్టి ఒక ప్రతిష్టాత్మక సినిమాను నిర్మిస్తే అప్పుడు బ్యానర్‌కు సార్థకత వస్తుందని అన్నారు. అదే విషయాన్ని కళ్యాణ్ రామ్ ఆలోచించి జూనియర్‌తో చెప్పడం, వెంటనే జూనియర్ కూడా ఓకే చెప్పడంతో ఈ సినిమా వచ్చిందని హరికృష్ణ చెప్పుకొచ్చారు.
దసరా సందర్బంగా ఈ సినిమాను ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా రాశిఖన్నా మరియు నివేదా థామస్‌లు కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆయన కెరీర్లోనే ఒక మరిచిపోలేని సినిమాగా ఉంటుందని సినీ వర్గాల వారు మరియు ఫ్యాన్స్ అంటున్నారు.