Site icon TeluguMirchi.com

ఒకేసారి ఎన్టీఆర్ మూడు అందిస్తున్నాడు..

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న అసలు సిసలైన జై లవకుశ టీజర్ డేట్ ప్రకటించారు చిత్ర యూనిట్. సినిమా కు సంబదించిన ఫస్ట్ లుక్ టీజర్ ను జులై 6 న సాయంత్రం 5 : 22 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ మూవీ లో ఎన్టీఆర్ మూడు పాత్రలతో కనిపించబోతున్న సంగతి తెల్సిందే..దానికి తగట్టే టీజర్ లో మూడు రోల్స్ కు సంబంధించి మూడు టీజర్లు రిలీజ్ చేయనున్నారట..అంటే ఒకేసారి అభిమానులు మూడు చూడబోతున్నారన్నమాట.

బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా నివేద థామస్, రాశి ఖన్నా లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇక టీజర్ తో ఇంకెన్ని అంచనాలు పెంచుతుందో చూడాలి.

Exit mobile version