Site icon TeluguMirchi.com

జై లవకుశ ‘దుబాయ్’ రివ్యూ వచ్చేసిందోచ్..

ఎన్టీఆర్ నటించిన జై లవకుశ మూవీ కి సంబదించిన సెన్సార్ కార్య క్రమాలు నిన్న పూర్తి చేసుకుంది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ వారు. ఇప్పటికే సెన్సార్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని , ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని చెప్పడం తో చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ లోపే దుబాయిలో ఉండే ఫిల్మ్ క్రిటిక్, సెన్సార్‌బోర్డ్ సభ్యుడు అయిన ఉమైర్ సంధు సినిమా రివ్యూ ఇచ్చేసాడు.

జై లవకుశ మాస్ ఎంటర్‌టైనర్‌గా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందనీ, మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఇరగదీశారని ఆయన ట్వీట్ చేశాడు. ఫస్ట్ కాపీని సెన్సార్ బోర్డు ఇప్పుడే చూసిందనీ, సినిమా బాగా వచ్చిందని, ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమన్నారు. నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఇంతవరకు చూడని ఎన్టీఆర్ ను ఈ మూవీ లో చూడబోతున్నారని , ఎన్టీఆర్ నటన , డాన్స్ లు , యాక్షన్ ఓ రేంజ్ లో ఉన్నాయని , ఈ చిత్రం లో ఎన్టీఆర్ ను చూసిన తర్వాత వేరే హీరో అభిమాని అయినా ఎన్టీఆర్ కు ఫిదా కావాల్సిందే అని తేల్చేసాడు.

బాబీ దర్శకత్వం కూడా అద్భుతంగా ఉందని , కోన వెంకట్ స్క్రిప్ట్ కూడా హైలైట్ గా ఉందని ఇలాంటి కథ ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో రాలేదని చెప్పుకొచ్చాడు. ఇక దేవి శ్రీ మ్యూజిక్ గురించి ఎంత చెప్పిన తక్కువే అన్నాడు..ముఖ్యం గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్ళేతుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదన్నారు.

చోట కే నాయుడు కెమెరా పనితనం చాల గొప్పగా ఉందని , ఎన్టీఆర్ ను మూడు షేడ్స్ లలో అద్భుతంగా చూపించాడని , అలాగే లొకేషన్స్ , హీరో , హీరోయిన్ల లను చాల గ్లామర్ గా చూపించాడని తెలిపాడు. కళ్యాణ్ రామ్ నిర్మాణ విలువలు చాల గొప్పగా ఉన్నాయి . ఆయన పెట్టిన ప్రతి రూపాయి తెర ఫై కనిపిస్తుందన్నారు.

మొత్తానికి ఉమర్ రివ్యూ నందమూరి అభిమానుల్లో సంబరాలు , మహేష్ అభిమానుల్లో టెన్షన్ మొదలు అయ్యాయి. మరి ఈయన రివ్యూ ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాలి.

Exit mobile version