Site icon TeluguMirchi.com

Jai Hanuman : జై హనుమాన్ రిలీజ్ అప్డేట్..


ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయం సాధించడంతో ప్రేక్షకులకు జై హనుమాన్ పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు హనుమాన్ సినిమా నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నుండి మరో సినిమా రాబోతుంది. ప్రియదర్శి, నబ్బా నటేష్ ప్రధాన పాత్రలుగా ‘డార్లింగ్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ నుండి శ్రీమతి చైతన్య రెడ్డి గారు మీడియా వారితో సమావేశం కావడం జరిగింది.

Also Read :  ‘కల్కి 2’ లో కృష్ణుడిగా మహేష్ బాబు.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ ?

ఈ సమావేశంలో ‘డార్లింగ్’ సినిమాతో పాటు జై హనుమాన్ కు సంబంధించిన విశేషాలు చెప్పడం జరిగింది. జై హనుమాన్ ఎంత వరకూ వచ్చింది ? సంక్రాంతికి వచ్చే పాజిబుల్ అవుతుందా ? అని మీడియా వారు అడగగా.. జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి పాజిబుల్ అయ్యేలా లేదు. హనుమాన్ కి ఈ రేంజ్ రీచ్ ని ఊహించలేదు. ఒక మార్వల్ లాంటి స్టొరీ తీసుకోస్తునప్పుడు ఆ రీచ్ వుండాలి కాబట్టి కొంచెం టైం తీసుకుని చేద్దామనేది మా ఆలోచన అని చెప్పారు. అంటే ఈ సంక్రాంతికి అయితే జై హనుమాన్ సినిమా రావడంలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.

Director Nag Ashwin Interaction with Media | Q&A with Nag Ashwin  #kalki2898ad #prabhas

Also Read : లావణ్య తో రిలేషన్ లో వున్నా.. కానీ..

అలాగే హనుమంతుడు క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారు అని అడగగా దానికి సమాధానం గా ఇప్పటికైతే ఎవరిని అనుకోలేదు కానీ హనుమంతుడుగా చిరంజీవి గారు లేదా రామ్ చరణ్ గారు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. నా పర్సనల్ ఒపీనియన్ అంటూ చైతన్య రెడ్డి గారు సమాధానం ఇచ్చారు.

Exit mobile version