ఈసారైనా రిలీజ్ అవుతుందా..?

jagga-jasoosరణబీర్ కపూర్, కత్రినాకైఫ్ జంటగా అనురాగ్ బసు దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ జగ్గా జాసూస్. ఎప్పుడో మూడేళ్ళ క్రితం షూటింగ్ మొదలు పెట్టిన ఈ మూవీ ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇప్పటికే పలుసార్లు రిలీజ్ డేట్స్ ప్రకటించిన థియేటర్స్ లోకి మాత్రం రాలేదు. తాజాగా మరో రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జులై 14న జగ్గా జాసూస్ థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు..కానీ బాలీవుడ్ జనాలు మాత్రం ఈ డేట్ కూడా రావడం కష్టమే అంటున్నారు.

వాస్తవానికి రిలీజ్ డేట్స్ విషయంలో బాలీవుడ్ లో క్లాష్ ఉండదు. హీరోలంతా ముందుగానే డేట్స్ లాక్ చేసుకుంటారు. కానీ జగ్గా జాసూస్ మాత్రం ఏడాదికో రిలీజ్ డేట్ తో సాగుతూనే ఉంది. అనురాగ్ బసు కేవలం దర్శకత్వం వహించడంతో పాటు రణబీర్ కపూర్ తో కలిసి ఈ సినిమాను జాయింట్ గా నిర్మిస్తున్నాడు .