Site icon TeluguMirchi.com

కొన్ని చెత్త సినిమాలు చేశా: జ‌గ‌ప‌తిబాబు

jagapathi-babuనేన‌న్నీ మంచి సినిమాలే చేశా.. కానీ ఎందుక‌నో ఆడ‌లేదు అని చెప్తుంటారు మ‌న హీరోలు. స‌రైన టైమ్‌లో విడుద‌ల కాలేద‌ని కొంద‌రు అంటే, ప్రేక్షకుల అభిరుచినే శంకించే హీరోలు ఇంకొంద‌రు. అయితే జ‌గ‌ప‌తిబాబు అలా కాదు. తన ఫ్లాప్‌ల‌ను ఒప్పుకొన్నారు. ఈమ‌ధ్య చెత్త సినిమాలు చేశా.. అని ఒప్పేసుకొన్నారు. అలాంటి ఊరూ పేరూ లేని సినిమాలు వంద చేయ‌డం కంటే – రూల‌ర్‌లో విల‌న్ పాత్ర ఒక్కటి త‌గిలినా చాలు అంటున్నారు. సోమ‌వారం జ‌గ‌ప‌తి బాబు హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడుతూ ”డ‌బ్బుల కోసం కొన్ని సినిమాలు చేయాల్సివ‌చ్చింది. ఆ సినిమాలు ఎప్పుడొచ్చాయో, ఎప్పుడు వెళ్లాయో నాకే తెలీదు. ప‌ట్టించుకోవ‌డం కూడా మానేశా. కొన్ని మంచి సినిమాలు విడుద‌ల కాలేక‌పోయాయి. అవి వ‌స్తే నా ప‌రిస్థితి మరోలా ఉండేదేమో..” అన్నారాయ‌న‌.

Exit mobile version