జాన్ కు విలన్ ఎవరో తెలుసా..?

సాహో తో అంచనాలు అందుకోలేకపోయిన ప్రభాస్..రాధాకృష్ణ డైరెక్షన్లో చేస్తున్న జాన్ సినిమాతో అభిమానులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త పడిన టీం..కాస్ట్ & క్రూ విషయంలోనూ జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ కు విలన్ గా ఎవరు సరిపోతారో ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

ఫ్యామిలీ హీరో నుండి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయినా జగపతి బాబు..జాన్ చిత్రంలో విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. రంగస్థలం చిత్రంలో మాదిరి జాన్ మూవీలో కూడా జగపతి బాబు పాత్ర విలక్షణంగా ఆకట్టుకొనేలా ఉంటుందని అంటున్నారు. 1960 ల కాలంలో యూరప్ లో జరిగిన ఓ అందమైన రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని గతంలో ప్రభాస్ చెప్పడం జరిగింది. ఇప్పటికే యూరప్ లో మొదటి షెడ్యూల్ పూర్తి కాగా..త్వరలో రెండో షెడ్యూల్ కు చిత్ర యూనిట్ సిద్దమయ్యింది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా..యువీ క్రియేషన్స్ & గోపి కృష్ణ బ్యానర్లు సంయుక్తం గా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.