రజనీ చాన్స్ మిస్ అయ్యింది ?

jagapathi
జగపతిబాబుకు రజనీకాంత్‌తో నటించే అవకాశం మిస్సయ్యింది. ఈ ఛాన్స్‌ కాస్త ‘ఈగ’ విలన్ సుదీప్‌ సొంతం చేసుకున్నాడు. రజనీకాంత్ హీరోగా కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో ‘లింగా’ పేరిట ఓ భారీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇందులో ప్రధాన విలన్ పాత్రకి మన జగపతిబాబుని తీసుకున్నట్టు ప్రచారం జరిగింది.’లెజండ్’ సినిమాలో ఆయన అభినయం చూసిన ఆ దర్శకుడు ఇతని వైపు మొగ్గినట్టు వార్తలొచ్చాయి. అయితే, చివరికి తర్జనభర్జనల తర్వాత ఆ పాత్రకి సుదీప్ ని ఎంపిక చేసినట్లు టాక్. మే రెండో వారం నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.