సల్మాన్ భాయ్ తో జగ్గు భాయ్ ఢీ..

ఫ్యామిలీ హీరో నుండి విలన్ గా మారిన జగపతి బాబు..ప్రస్తుతం అన్ని భాషల్లో అవకాశాలను దక్కించుకుంటూ బిజీ యాక్టర్ అయ్యాడు. ఇటీవలే రంగస్థలం చిత్రం లో ప్రసిడెంట్ పాత్రలో అదరగొట్టిన జగపతి..తాజాగా బాలీవుడ్ లో ఛాన్స్ దక్కినట్లు సమాచారం.

త్వరలో ప్రభుదేవా – సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో విలన్ గా జగపతి బాబు కు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ తో జగపతి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టబోతున్నాడు. మార్చి చివరి వారం లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రభుదేవా బిజీ గా ఉన్నాడు.