Site icon TeluguMirchi.com

సూపర్ స్టార్ కు విలన్ గా ?

jagapathibabu
సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు .. బిజీ విలన్ గా మారాడు. ‘లెజండ్’ విలన్ పాత్ర హిట్టవడంతో అలాంటి పాత్రలకోసం దర్శక నిర్మాతలు జగపతి వెంట పడుతున్నారు. ఈ వరుసలో ఆయనకు కోలివుడ్ నుండి ఓ సూపర్ ఆఫర్ అందినట్లు టాక్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే సినిమాలో విలన్ గా జగపతిని ఎంపికైనట్టు కోలీవుడ్ సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారట. కె.యస్. రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొచ్చడియాన్ రిలీజ్ తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. చిత్రానికి ఏ అర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించనున్నారు.

Exit mobile version