ఎన్టీఆర్ కు విలన్ అయిన తండ్రి…

jagapathi babuఏంటి టైటిల్ చూసి ఖంగారు పడుతున్నారా..? అంత ఖంగారు పడాల్సిన అవసరం లేదులెండి..జస్ట్ మేము చెపుతుంది కేవలం ఎన్టీఆర్ చేయబోయే చిత్రం లోని విలన్ గురించి మాత్రమే….

టెంపర్ చిత్రం తో ఫుల్ జోష్ మీద ఉన్న ఎన్టీఆర్..తాజాగా సుకుమార్ తో చేయబోయే చిత్రం కూడా అంతే జోష్ ని అబిమనులలో నిపెందుకు రెడీ అవుతున్నాడు. ఈ నెల చివర్లో అబ్రాడ్ లో ఈ చిత్రం మొదటి షెడ్యూల్ జరుపుకోబుతుంది . తండ్రి సెంటిమెంట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఎన్.టి.ఆర్ ఈ చిత్రం లో ఓ కొత్త లుక్ కనిపించనున్నారు.

ఎన్.టి.ఆర్ కి ఫాదర్ పాత్రలో జగపతి బాబు కనిపించబోతున్నాడు. జగపతి బాబు ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినపడుతున్నాయి. జగపతి బాబు ఎన్.టి.ఆర్ తండ్రి లానే కనిపిస్తూ నెగటివ్ షేడ్స్ లో ఎన్టీఆర్ ని దెబ్బ తీసే ప్రయత్నం చేయబోతున్నాడట. ఈ చిత్రం లో ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.